Telugu Global
Cinema & Entertainment

మహేష్ తో మూవీపై స్పందించిన రాజమౌళి

త్వరలోనే మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు రాజమౌళి. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్వయంగా రాజమౌళి స్పందించడంతో, ఈ ప్రాజెక్టు మరోసారి తెరపైకొచ్చింది.

మహేష్ తో మూవీపై స్పందించిన రాజమౌళి
X

మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ బయటపెట్టాడు రాజమౌళి. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న ఈ దర్శకుడు, టొరంటో చిత్రోత్సవానికి హాజరయ్యాడు. ఆ వేదికపై మహేష్ బాబు మూవీపై స్పందించాడు. మహేష్ బాబుతో చేయబోయే మూవీ గ్లోబల్ మొత్తం ట్రావెల్ అయ్యేలా ఉంటుందని అన్నాడు.

మహేష్ బాబుతో ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ అడ్వెంచరస్ మూవీతో తీయబోతున్నాడు రాజమౌళి. ఈ జానర్ కు ఇండియన్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి ఓ కథ రెడీ చేయబోతున్నాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో షూట్ చేస్తామనే విషయాన్ని తాజాగా రాజమౌళి బయటపెట్టాడు.

ఈ సినిమా కథపై విజయేంద్రప్రసాద్ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. త్వరలోనే రాజమౌళి-విజయేంద్రప్రసాద్ కలిసి ఈ కథపై పూర్తిస్థాయిలో వర్క్ మొదలుపెడతారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను ప్రారంభించాలని అనుకుంటున్నారు.

First Published:  13 Sep 2022 4:37 AM GMT
Next Story