Telugu Global
Cinema & Entertainment

Salaar | సలార్ మొదటి టికెట్ కొన్న జక్కన్న

Salaar - ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సలార్. ఈ సినిమా ఫస్ట్ టికెట్ ను రాజమౌళి కొనుగోలు చేశాడు.

Salaar | సలార్ మొదటి టికెట్ కొన్న జక్కన్న
X

రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ సలార్- సీజ్ ఫైర్’. ఈ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డొమస్టిక్, ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్లు సాధించడానికి సిద్ధంగా ఉంది.

ప్రభాస్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బాహుబలి’ని అందించిన దర్శకధీరుడు రాజమౌళి ‘సలార్’ ఫస్ట్ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. నైజాంలో సినిమాను విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఫోటోను షేర్ చేస్తూ..."ప్రైడ్ అఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి సలార్ ఫస్ట్ టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. నైజాంలో ఈ సినిమాను మైత్రీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

మేకర్స్ షేర్ చేసిన ఫోటోలో రాజమౌళి తో పాటు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్, మైత్రీ నవీన్ యెర్నేని, హోంబలే ఫిలిమ్స్ విజయ్ కిరంగదూర్‌ ఉన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్ లో ఉదయం 7 గంటల షో టికెట్ కొనుగోలు చేశారు రాజమౌళి.

శృతి హాసన్, జగపతి బాబు ఇతర ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా కోసం నైజాంలో టికెట్ రేట్లు భారీగా పెంచారు. అంతేకాదు, అర్థరాత్రి షోలకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు.

First Published:  17 Dec 2023 8:23 AM GMT
Next Story