Telugu Global
Cinema & Entertainment

Gaami | రాజమౌళి మెచ్చిన గామి

Rajamouli Gaami Movie - విశ్వక్ సేన్ తాజా చిత్రం గామి. ఈ సినిమాను రాజమౌళి ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు.

Gaami | రాజమౌళి మెచ్చిన గామి
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి' మార్చి 8 న మహా శివరాత్రి నాడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే ఈ సినిమా ఎట్రాక్ట్ చేస్తోంది. పలువురు సెలబ్రిటీల నుంచి ప్రోత్సాహకరమైన మాటలు కూడా సినిమాకి హెల్ప్ అయ్యాయి. ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించగా, వి సెల్యులాయిడ్ సమర్పిస్తున్నారు.

తాజాగా ఎస్ఎస్ రాజమౌళి, గామి టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.“అసాధ్యమైన కలని సాకారం చేయాలంటే అహర్నిశలు కష్టపడాలని నిర్మాత కార్తీక్ , దర్శకుడు విద్యాధర్ నన్ను కలిసినప్పుడు చెప్పారు. అద్భుతమైన విజువల్స్ సాధించడంలో వారి 4 సంవత్సరాల కృషి గురించి మాట్లాడినప్పుడు నాక్కూడా అర్థమైంది. మార్చి 8న విడుదల కానున్న గామి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు” అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నారు రాజమౌళి.

రాజమౌళి హృదయపూర్వక అభినందనపై ఆనందం వ్యక్తం చేసిన విశ్వక్ సేన్, దర్శకధీరుడికి ధన్యవాదాలు తెలిపాడు. అంతకుముందు ప్రభాస్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ఇంకా పలువురు సెలబ్రిటీలు టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.

First Published:  6 March 2024 5:15 PM GMT
Next Story