Telugu Global
Cinema & Entertainment

రాజమండ్రి రోజ్ మిల్క్ టీజర్ రివ్యూ

చిన్న సినిమాగా తెరకెక్కుతోంది రాజమండ్రి రోజ్ మిల్క్. కానీ సురేష్ బాబు నిర్మాత కావడంతో ఇది పెద్ద సినిమాగా మారింది. తాజాగా టీజర్ రిలీజైంది.

రాజమండ్రి రోజ్ మిల్క్ టీజర్ రివ్యూ
X

రాజమండ్రి రోజ్ మిల్క్.. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు కొత్త, దర్శకుడు కొత్త. అయినప్పటికీ ఇండస్ట్రీని, పరిశ్రమతో పాటు ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. దీనికి కారణం ఈ సినిమా ఏదో మేజిక్ చేస్తుందనే నమ్మకమే. లేకపోతే సురేష్ బాబు లాంటి నిర్మాత ఇలాంటి చిన్న ప్రాజెక్టులోకి దిగరు కదా.

అలా అందరి దృష్టిని ఆకర్షించిన రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే ఈ సినిమాపై అంచనాలు పెట్టుకోవచ్చనే నమ్మకం ఇంకాస్త పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్యూట్ టీజర్ చూడలేదు. యూత్‌ఫుల్‌గా.. ఎంతో ఫ్రెష్ గా ఉంది ఈ టీజర్.

టీజర్ చూస్తే, ఈ చిత్రంలో తప్పకుండా సమ్‌థింగ్ స్పెషల్ ఉంటుందనిపిస్తోంది. జై, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంతో, నాని బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి ఇంట్రూప్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు.

రాజమండ్రి రూరల్ బ్యాక్ డ్రాప్ లో అందమైన టీనేజ్ ప్రేమకథగా ఈ సినిమా వస్తోంది. కాలేజీ రోజుల్లో మరపురాని సంఘటనలను, మధురానుభూతులను ఈ సినిమా అందరికి గుర్తుకు తెస్తుందని చెబుతున్నారు మేకర్స్. టీజర్ లో ఫ్రేమ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.



First Published:  22 Oct 2022 12:56 PM GMT
Next Story