Telugu Global
Cinema & Entertainment

Brahma Anandam | తండ్రికొడుకుల సినిమా గ్లింప్స్

Raja Gautham Brahma Anandam - తండ్రీకొడుకులైన రాజా గౌతమ్, బ్రహ్మానందం కలిసి సినిమా చేశాడు. ఆ మూవీ గ్లింప్స్ ఈరోజు రిలీజైంది.

Brahma Anandam | తండ్రికొడుకుల సినిమా గ్లింప్స్
X

హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ఔట్ అండ్ ఔట్ఎంటర్‌టైనర్ ‘బ్రహ్మ ఆనందం’లో తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. కొత్త దర్శకుడు నిఖిల్ తీస్తున్న ఈ మూవీని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.

ఇటీవల మేకర్స్ బ్రాహ్మ ఆనందం ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. బ్రహ్మానందం ట్రెడిషనల్ అవతార్‌లో కనిపించిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు, రక్షా బంధన్‌ను పురస్కరించుకుని, మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు.

రాజా గౌతమ్ పరిచయంతో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. నిత్యావసరాలకు కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న హోప్ లెస్ యువకుడిగా రాజా గౌతమ్ కనిపించిన తీరు ఆసక్తికరంగా ఉంది. వెన్నెల కిషోర్ అతని స్నేహితుడిగా కనిపించాడు. తను ఓ ఎదుగుదల లేని డాక్టర్.

ఇక గ్లింప్స్ చివర్లో బ్రహ్మానందం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో డ్రామా మరింత ఆసక్తికరంగా మారింది. గ్లింప్స్ లో మూడు పాత్రలను హిలేరియస్ గా డిజైన్ చేశారు.

ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 6న బ్రహ్మ ఆనందం విడుదల కానుంది.

First Published:  19 Aug 2024 3:42 PM GMT
Next Story