Telugu Global
Cinema & Entertainment

Raj Tarun | 'తిరగబడరా సామీ' స్టోరీ లైన్ చెప్పిన హీరో

Raj Tarun's Tiragabadara saamy movie - రాజ్ తరుణ్ కొత్త సినిమా పేరు తిరగబడరా సామీ. ఈ సినిమా టైటిల్ పై చాలామందికి చాలా అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేశాడు హీరో.

Raj Tarun | తిరగబడరా సామీ స్టోరీ లైన్ చెప్పిన హీరో
X

రాజ్ తరుణ్ హీరోగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తిరగబడరసామీ'. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామానాయడు స్టూడియోలో జరుగుతోంది. హీరో, హీరోయిన్, రాజా రవీంద్రపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది. సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

"తిరగబడరసామీ మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్. రవికుమార్ చౌదరి గారి గత సినిమాల్లానే యాక్షన్ కామెడీ రొమాన్స్ ఎక్కడా తగ్గకుండా ఉంటాయి. మొత్తం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ చివరి దశలో ఉన్నాయి. అతి త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తిరగబడరసామీ యూత్ ఫుల్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఒక పాయింట్ గా చెప్పాలంటే.. ఒక బంధాన్ని నిలుపుకోవడం కోసం భార్య భర్తలు, ప్రేమికులు ఎంతవరకూ వెళ్తారనేది చాలా వినోదాత్మకంగా చూపించాం.’’

ఇలా సినిమా జానర్ పై స్పష్టత ఇచ్చాడు హీరో రాజ్ తరుణ్. టైటిల్ చూసి ఇదేదో విప్లవం సినిమా లేదా యాక్షన్ మూవీ అనుకోవద్దని చెబుతున్నాడు. సినిమా చూస్తే, టైటిల్ ఎందుకు పెట్టామో అర్థం అవుతుందని, ఫ్యామిలీస్ అంతా కలిసి కూర్చొని ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చని భరోసా ఇస్తున్నాడు.

First Published:  3 Aug 2023 4:25 AM GMT
Next Story