Telugu Global
Cinema & Entertainment

Raj Tarun | మరో సినిమా రెడీ చేసిన రాజ్ తరుణ్

Raj Tarun - ఓవైపు నాగార్జునతో నా సామిరంగ సినిమా చేసిన రాజ్ తరుణ్, అదే టైమ్ లో తను హీరోగా మరో సినిమా కూడా పూర్తిచేశాడు.

Raj Tarun | మరో సినిమా రెడీ చేసిన రాజ్ తరుణ్
X

రాజ్ తరుణ్ హీరోగా, ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్‌టైనర్ 'తిరగబడరా సామీ'. మాల్వి మల్హోత్రా హీరోయిన్ గా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ను తెలంగాణలోని జహీరాబాద్ లో ఉన్న సరికొత్త లోకేషన్స్ లో పూర్తిచేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. యువతని ఆకట్టుకునే రొమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. మన్నారా చోప్రా ఈ చిత్రంలో ఓ విభిన్న పాత్రతో పాటు ఐటెంసాంగ్ చేసింది.

ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు. జేబీ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జునతో కలిసి రాజ్ తరుణ్ నటించిన నా సామిరంగ సినిమా సంక్రాంతికి వస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకే తిరగబడరా సామి సినిమా రాబోతోంది.

First Published:  7 Jan 2024 3:55 PM GMT
Next Story