Telugu Global
Cinema & Entertainment

Raj Tarun New Movie | రాజ్ తరుణ్ "భలే ఉన్నాడే!"

Raj Tarun's Bhale Vunnade - నా సామిరంగ సినిమాలో కీలక పాత్ర పోషించిన రాజ్ తరుణ్, ఇప్పుడు హీరోగా మరో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ విశేషాలు చూద్దాం..

Raj Tarun New Movie | రాజ్ తరుణ్ భలే ఉన్నాడే!
X

దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్ మారుతి మంచి కాన్సెప్ట్‌లతో విలక్షణమైన సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న ఈ దర్శకుడు.. తన కొత్త ప్రొడక్షన్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎన్వీ కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

రాజ్ తరుణ్ ఈ సినిమాలో హీరో. గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, హలో వరల్డ్ లాంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లను అందించిన జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. సంక్రాంతి సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు 'భలే ఉన్నాడే' అనే చక్కని టైటిల్‌ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాజ్ తరుణ్‌ని రాధగా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆహ్వాదకరమైన బ్యాక్ డ్రాప్ లో రాజ్ తరుణ్ అందమైన చిరునవ్వుతో నడుస్తున్న స్టిల్ ను రిలీజ్ చేశారు.

కృష్ణ పాత్రలో మనీషా కంద్కూర్ హీరోయిన్ గా పరిచయం అవుతుండగా, లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిరామి (చెప్పవే చిరుగాలి, పోతు రాజు ఫేమ్), అమ్ము అభిరామి (నారప్ప ఫేమ్), లీలా శాంసన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  15 Jan 2024 10:59 AM GMT
Next Story