Telugu Global
Cinema & Entertainment

Bhale Unnade | రాజ్ తరుణ్ సినిమాలో సోఫియా సాంగ్

Raj Tarun's Bhale Unnade - భలే ఉన్నాడే సినిమా నుంచి మరో సాంగ్ వచ్చింది. విశ్వక్ సేన్ రిలీజ్ చేశాడు.

Bhale Unnade | రాజ్ తరుణ్ సినిమాలో సోఫియా సాంగ్
X

యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మూవీ నుంచి ‘సోఫియా’ సాంగ్ ని లాంచ్ చేశాడు. హార్ట్ బ్రోకెన్ బాయ్స్ అందరికీ ఈ పాటను అంకితం చేస్తూ.. శేఖర్ చంద్ర చాలా క్యాచిగా కంపోజ్ చేశాడు.

శేఖర్‌చంద్ర, దేవ్ రాసిన లిరిక్స్ కి కరీముల్లా వోకల్స్ బాగా సెట్ అయ్యాయి. ఈ సాంగ్ లో రాజ్ తరుణ్ డ్యాన్స్ ఆకట్టుకుంది.

ఈ సినిమా ట్రయిలర్ ఇప్పటికే పెద్ద హిట్టయింది. ఎవరూ ఊహించని డిఫరెంట్ రోల్ లో రాజ్ తరుణ్ ను చూపించాడు దర్శకుడు శివసాయి వర్థన్. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. మనీషా కంద్కూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రాజ్ తరుణ్ కు ఈ ఏడాది ఇది మూడో సినిమా.

First Published:  27 Aug 2024 6:33 AM GMT
Next Story