Telugu Global
Cinema & Entertainment

Raj Tarun | రాజ్ తరుణ్ కొత్త సినిమా సంగతులు

Raj Tarun Starts New Movie - రాజ్ తరుణ్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. హారర్ కామెడీ జానర్ టచ్ చేస్తున్నాడు.

Raj Tarun | రాజ్ తరుణ్ కొత్త సినిమా సంగతులు
X

రాజ్ తరుణ్ హీరోగా కనెక్ట్ మూవీస్ బ్యానర్ పై సినిమా ప్రారంభమైంది. రమేష్ కడుముల దర్శకుడిగా పరిచయం చేస్తూ మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్. కె. ఎన్ , నక్కిన త్రినాధ రావు , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక కూచిబొట్ల తదితరులు హాజరయ్యారు. మారుతి క్లాస్ చేయగా ప్రవీణ్ సత్తార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నక్కిని త్రినాధరావు ఫస్ట్ షార్ట్ డైరెక్ట్ చేయగా ధీరజ్ మొగిలినేని, వంశీ స్క్రిప్ట్ అందజేశారు.

ఈ సినిమా షూటింగ్ ఈనెల 15 నుండి ప్రారంభమవుతుంది. ఏకథాటిగా షూటింగ్ ఉంటుంది. అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదొక క్రైమ్ కామెడీ జానర్ మూవీ. స్వామిరారా, అంధధూన్ తరహాలో ఉంటుంది.

కథ చాలా బాగా వచ్చిందంటున్నాడు హీరో. క్రైమ్ కామెడీ తన ఫేవరట్ జానర్ అని.. సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అంటున్నాడు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, 'బేబీ' ఫేమ్ సురేష్ బీమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నారు.

First Published:  13 April 2024 1:12 AM GMT
Next Story