Telugu Global
Cinema & Entertainment

Raj Tarun | డబ్బింగ్ చెబుతున్న పురుషోత్తముడు

Raj Tarun - రాజ్ తరుణ్ మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు.

Raj Tarun | డబ్బింగ్ చెబుతున్న పురుషోత్తముడు
X

రాజ్ తరుణ్ హీరోగా సైలెంట్ గా ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి పురుషోత్తముడు అనే టైటిల్ పెట్టారు. రామ్ భీమన దర్శకుడు. రాజమండ్రిలో వేసిన భారీ సెట్ లో ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ షెడ్యూల్ పూర్తయింది. దీంతో టాకీ మొత్తం కంప్లీట్ అయింది.

ఈ సందర్భంగా 22న టైటిల్ రివీల్ పోస్టర్ ని విడుదల చేశారు. అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ట రోజు ఆదే సమయానికి టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ భీమన తెలిపారు. ప్రస్తుతానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. తన పాత్రకు రాజ్ తరుణ్ డబ్బింగ్ చెబుతున్నాడు.

గీతగోవిందం లాంటి కల్ట్ సినిమాను అందించిన గోపీసుందర్, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక టాప్ కెమెరామేన్ పీజీ విందా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. హాసినీ సుధీర్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతుండగా.. మురళి శర్మ, కౌసల్య, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నా సామిరంగ సినిమాలో పోషించిన పాత్రతో మంచి మార్కులు తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. ఆ సినిమా తర్వాత అతడి నుంచి రాబోతున్న మూవీ ఇదే. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  25 Jan 2024 5:18 PM GMT
Next Story