Telugu Global
Cinema & Entertainment

Raj Tarun | భలే ఉన్నాడే ట్రయిలర్ రిలీజ్

Raj Tarun - ముచ్చటగా మూడో సినిమా రెడీ చేశాడు రాజ్ తరుణ్. భలే ఉన్నాడే ట్రయిలర్ ఈరోజు రిలీజైంది.

Raj Tarun | భలే ఉన్నాడే ట్రయిలర్ రిలీజ్
X

యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివసాయి వర్ధన్ డైరెక్టర్. క్రేజీ డైరక్టర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉండే హీరో పాత్రని హిలేరియస్ గా పరిచయం చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, వారి లవ్ స్టొరీ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి. ట్రైలర్ లో ఫన్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి.

డైరెక్టర్ శివసాయి వర్ధన్ ఒక యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. రాజ్ తరుణ్‌ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు. ఇలాంటి పాత్రను ఎంచుకున్నందుకు రాజ్ తరుణ్ ని అభినందించాలి. రాజ్ తరుణ్ పెర్ ఫార్మెన్స్, కామిక్ టైమింగ్ బాగున్నాయి.

నగేష్ బనెల్లా కెమెరా వర్క్, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ బాగున్నాయి. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

సింగీతం శ్రీనివాసరావు, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

First Published:  19 Aug 2024 3:37 PM GMT
Next Story