Telugu Global
Cinema & Entertainment

Vimanam Movie - దర్శకేంద్రుడు మెచ్చిన 'విమానం'

Raghavendra Rao Vimanam Movie - విమానం మూవీ ట్రయిలర్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.

Vimanam Movie - దర్శకేంద్రుడు మెచ్చిన విమానం
X

తండ్రీ కొడుకులు మ‌ధ్య భావోద్వేగం, లవ్ వంటి ఎమోష‌న్స్ కల‌యిక‌గా రూపొందిన చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌ తో కలిసి కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్‌గా హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చేతుల మీదుగా విడుద‌లైన మూవీ ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ‘విమానం’ మూవీ ట్రైల‌ర్‌ చూసిన దర్శకుడు కె.రాఘవేంద్ర‌రావు, ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

‘‘విమానం సినిమా ట్రైల‌ర్ చూశాను. ట్రైల‌ర్ చాలా బాగా వ‌చ్చింది. చాలా మంచి ఎమోష‌న్స్‌తో సినిమా ఉంటుంద‌ని తెలిసింది. అలాగే ద‌ర్శ‌కుడు శివ ప్ర‌సాద్, తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే ఎమోష‌న్ గురించి చెబుతుంటే బాగా ట‌చింగ్‌గా అనిపించింది. క‌ళ్ల‌లో నీళ్లు వ‌చ్చాయి. ఇలాంటి డిఫ‌రెంట్ కంటెంట్ సినిమాల‌ను ప్రొడ్యూస‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎంక‌రేజ్ చేయాలి. త‌ల్లిదండ్రులు ‘విమానం’ సినిమాను చూడటమే కాకుండా.. వాళ్ల పిల్లలకు కూడా సినిమాను చూపించాలి. అప్పుడే ఇందులో పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుందనేది తెలుస్తుంది."

ఇలా విమానం ట్రయిలర్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు రాఘవేంద్రరావు. ‘విమానం’ చిత్రంలో వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు.

ప్ర‌ముఖ నటి మీరా జాస్మిన్, ఈ సినిమాలో అతిథి పాత్ర‌లో న‌టించింది. జూన్ 9న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అవుతుంది.

First Published:  4 Jun 2023 2:55 PM GMT
Next Story