Telugu Global
Cinema & Entertainment

Rage Of Bholaa | భోళాశంకర్ ప్రమోషనల్ సాంగ్ అదుర్స్

Bholaa Shankar - చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళాశంకర్. ఈ సినిమా నుంచి ప్రచార గీతాన్ని విడుదల చేశారు.

Rage Of Bholaa | భోళాశంకర్ ప్రమోషనల్ సాంగ్ అదుర్స్
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “భోళా శంకర్”. ఈ ఏడాది ఆల్రెడీ వచ్చిన “వాల్తేరు వీరయ్య” సెన్సేషనల్ హిట్ అవ్వడంతో.. భోళాపై మంచి హైప్ జనరేట్ అయింది. ఈ హైప్ కు తగ్గట్టే ప్రచారం చేస్తోంది యూనిట్. తాజాగా "రేజ్ ఆఫ్ భోళా" పేరిట ప్రమోషనల్ సాంగ్ లాంచ్ చేశారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ చేతుల మీదుగా ఈ సాంగ్ ను విడుదల చేయడం విశేషం.

భోళాశంకర్ సినిమాకు సంబంధించి ప్రతి పాటను ఓ సంగీత దర్శకుడితో విడుదల చేస్తున్నారు. ఓ పాటను దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేస్తే, మరోపాటను తమన్ రిలీజ్ చేశాడు. ఇంకో పాటను మణిశర్మ ఆవిష్కరించాడు. ఇప్పుడు "రేజ్ ఆఫ్ భోళా" పేరిట కంపోజ్ అయిన ప్రచార గీతాన్ని రెహ్మాన్ రిలీజ్ చేశారు.

ర్యాప్ స్టయిల్ లో సాగే సాంగ్ ఇది. ఈ పాట సినిమాలో ఉండదు. కేవలం ప్రచారం కోసం మాత్రమే. వీలైతే ఎండ్ టైటిల్స్ లో పెట్టే అవకాశం ఉంది. ఇక ఈ పాటకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. స్వయంగా దర్శకుడు మెహర్ రమేష్ ఈ సాంగ్ కు లిరిక్స్ అందించాడు.

చిరంజీవి, తమన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను 11వ తేదీన విడుదల చేస్తున్నారు. తాజాగా సెన్సార్ పూర్తయింది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  5 Aug 2023 11:56 AM GMT
Next Story