Telugu Global
Cinema & Entertainment

BAAK - ఒకేసారి 2 ఫస్ట్ లుక్కులు

BAAK Movie - ఈ సినిమా నుంచి ఇప్పటికే తమన్న లుక్ రిలీజైంది. ఈరోజు రాశిఖన్నా, వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు.

BAAK - ఒకేసారి 2 ఫస్ట్ లుక్కులు
X

అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ 'అరణ్మనై'. తెలుగులో కూడా ఈ సినిమాలు హిట్టయ్యాయి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి నాలుగో సినిమా వస్తోంది. స్వీయ దర్శకత్వంలో సుందర్ సి హీరోగా నటించిన ఈ సినిమాకు తెలుగులో బాక్ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ అర్థం తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.

సినిమాలో తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించగా, వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ల ద్వారా సుందర్ సి, తమన్నా పాత్రలను ఇదివరకే పరిచయం చేశారు. ఈ రోజు రాశీఖన్నా, వెన్నెల కిషోర్‌ల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లను విడుదల చేశారు. 2 పోస్టర్లలో హాంటెడ్ హౌస్ కనిపిస్తోంది. రాశి ఖన్నా భయంతో కనిపించగా, వెన్నెల కిషోర్ కూడా టెన్షన్‌ పడతూ కనిపించాడు.

అవ్ని సినిమాక్స్ బ్యానర్ పై సుందర్ సి భార్య ఖుష్బూ ఈ సినిమాను నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు హిపాప్ తమిళ సంగీతం అందించాడు.






First Published:  11 April 2024 4:07 PM GMT
Next Story