Telugu Global
Cinema & Entertainment

విజయ్ సరసన మరోసారి రాశిఖన్నా?

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. సమంత ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు రాశి ఖన్నాను కూడా మరో హీరోయిన్ గా తీసుకునే యోచనలో ఉన్నారు.

విజయ్ సరసన మరోసారి రాశిఖన్నా?
X

విజయ్ దేవరకొండ, రాశిఖన్నా కాంబినేషన్ కొత్తేం కాదు. ఇంతకుముందు ఇద్దరి కాంబోలో సినిమా వచ్చింది. కాకపోతే అది ఫ్లాప్ అయింది. ఇప్పుడీ హీరోహీరోయిన్లు మళ్లీ కలవబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషీ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా కనిపించనుంది.

నిజానికి ఖుషీ సినిమాలో హీరోయిన్ ఆల్రెడీ ఉంది. ఇందులో మెయిన్ హీరోయిన్ సమంత. కాకపోతే సెకండాఫ్ లో వచ్చే మరో కీలకమైన పాత్ర కోసం ఇంకో హీరోయిన్ కావాలి. ఆ క్యారెక్టర్ కోసం రాశి ఖన్నాను తీసుకున్నట్టు తెలుస్తోంది. పాత్ర నచ్చడంతో, సెకెండ్ లీడ్ అయినప్పటికీ చేయడానికి రెడీ అయిందంట ఈ ముద్దుగుమ్మ.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఖుషి సినిమా. లైగర్ ఫ్లాప్ తో ఇటు విజయ్ దేవరకొండ, టక్ జగదీశ్ ఫ్లాప్ తో అటు శివ నిర్వాణ ఇద్దరూ కసి మీదున్నారు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అటు రాశిఖన్నా కు కూడా హిట్ అత్యవసరం.

First Published:  20 Sep 2022 1:33 PM GMT
Next Story