Telugu Global
Cinema & Entertainment

రాశిఖన్నాకు మరో ఛాన్స్.. ఈసారి ఏమౌతుందో!

పక్కా కమర్షియల్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది రాశీ ఖన్నా. ఇప్పుడీ ముద్దుకు థాంక్యూ సినిమాతో మరో అవకాశం దక్కింది.

రాశిఖన్నాకు మరో ఛాన్స్.. ఈసారి ఏమౌతుందో!
X

రాశిఖన్నా కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ. అయినప్పటికీ తనకున్న అందచందాలతో, ఇండస్ట్రీ ప్రముఖులతో ఉన్న సంబంధాలతో దశాబ్ద కాలంగా హీరోయిన్ గా చలామణి అవుతోంది ఈ చిన్నది. ఎప్పటికప్పుడు అవకాశాలు అందిపుచ్చుకుంటూనే ఉంది. అయితే సక్సెస్ లేనప్పుడు ఇవేవీ ఎక్కువకాలం కాపాడలేవు. ప్రస్తుతం రాశి అదే స్టేజ్ లో ఉంది.

రీసెంట్ గా ఆమె నటించిన పక్కా కమర్షియల్ సినిమా ఫ్లాప్ అయింది. మారుతిని సేవ్ చేసేందుకు, ఆ సినిమాను సూపర్ హిట్ అంటూ మేకర్స్ ప్రకటించుకున్నప్పటికీ, వాస్తవం ఏంటనేది అందరికీ తెలుసు. అందులో హీరోయిన్ గా నటించిన రాశిఖన్నాపై ఆ ప్రభావం గట్టిగానే పడింది. ఇప్పుడు ఆమెకు థాంక్యూ రూపంలో సెకెండ్ ఛాన్స్ వచ్చింది.

నాగచైతన్య హీరోగా నటించిన సినిమా థాంక్యూ. ఇందులో మెయిన్ హీరోయిన్ గా నటించింది రాశిఖన్నా. సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందట. ఈ సినిమా సక్సెస్ అయితేనే రాశీ ఖన్నా కెరీర్ మరికొన్నాళ్లు సాగుతుంది. లేదంటే ఆమెపై నెగెటివ్ రిమార్క్ పడడం ఖాయం. వరుసగా 2 ఫ్లాపులిచ్చిన హీరోయిన్లను తీసుకునేందుకు ఇండస్ట్రీలో ఎవ్వరూ ముందుకురారు. రాశి కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే థాంక్యూ సినిమా సక్సెస్ కోసం ఆమె ఈగర్ గా ఎదురుచూస్తోంది.

ప్రస్తుతానికైతే రాశిఖన్నా, కెరీర్ పరంగా ప్లాన్-బిలో ఉంది. తెలుగు నుంచి ఆమెకు అవకాశాలు రాకపోయినా, వెబ్ సిరీస్ లు, తమిళ ఆఫర్లు రెడీగా పెట్టుకుంది. కానీ టాలీవుడ్ లో సక్సెస్ అనేది క్రేజ్ పరంగా రాశి ఖన్నాకు చాలా అవసరం. అందుకే థాంక్యూ సినిమా, రాశిఖన్నా కెరీర్ కు కీలకంగా మారింది.

First Published:  19 July 2022 9:30 AM GMT
Next Story