Telugu Global
Cinema & Entertainment

Janata Bar - రాయ్ లక్ష్మి కొత్త సినిమా జనతా బార్ విశేషాలు

Raai Laxmi's Janatha Bar - రాయ్ లక్ష్మీ లీడ్ రోల్ పోషించిన సినిమా జనతా బార్. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది.

Janata Bar - రాయ్ లక్ష్మి కొత్త సినిమా జనతా బార్ విశేషాలు
X

రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం జనతాబార్. రమణ మొగిలి దర్శకుడు. శ్రీ మూవీస్ పతాకంపై రమణ మొగిలి, తిరుపతి రెడ్డి బీరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు పరశురామ్ తాజాగా విడుదల చేశాడు.

రాయ్‌లక్ష్మీ కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం అవుతుదంటున్నాడు దర్శకుడు రమణ. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌ అంట. ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన పరశురామ్, యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపాడు. మంచి క్యాచీ టైటిల్ పెట్టారని మెచ్చుకున్నాడు.

స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడిన ఓ మహిళ కథ ఇది. ఈ కాన్సెప్ట్ కు, జనతా బార్ కు లింక్ ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలంటున్నాడు డైరక్టర్.

వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు.

First Published:  24 March 2023 7:57 AM GMT
Next Story