Telugu Global
Cinema & Entertainment

పుష్ప విలన్ నుంచి స్ట్రయిట్ తెలుగు సినిమా

పుష్ప సినిమాలో విలన్ గా నటించిన ఫహాద్ ఫాజిల్ కు తెలుగులో క్రేజ్ తో పాటు మార్కెట్ పెరిగింది. ఇప్పుడీ నటుడు తెలుగులో హీరోగా స్ట్రయిట్ మూవీ చేస్తున్నాడు.

పుష్ప విలన్ నుంచి స్ట్రయిట్ తెలుగు సినిమా
X

పుష్ప సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ అయ్యాడు ఫహాద్ ఫాజిల్. ఆ తర్వాతొచ్చిన విక్రమ్ సినిమాతో తెలుగులో ఇతడి పాపులారిటీ మరింత పెరిగింది. ఇప్పుడీ నటుడ్ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది టాలీవుడ్ లో. ఒకప్పటి ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఫాజిల్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఇది స్ట్రయిట్ తెలుగు సినిమా.

సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో వస్తున్న 96వ చిత్రమిది. సుధీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడు. యాక్షన్-థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాకు టాప్ గేర్ అనే టైటిల్ పెట్టారు.

టైటిల్ పోస్టర్‌ లో లుంగీ కట్టుకున్న ఫహాద్ ఫాజిల్ జీపుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు. పోస్టర్ లో సూచించినట్లుగా, టాప్ గేర్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా ఉండబోతోంది. ఇప్పటికే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా మొదలైంది.

ఆర్‌బి చౌదరి సమర్పణలో భారీ బడ్జెట్‌ తో ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ ను చెన్నై, హైదరాబాద్ లో పూర్తి చేయబోతున్నారు.




First Published:  11 Sep 2022 7:33 AM GMT
Next Story