Telugu Global
Cinema & Entertainment

Pushpa | పుష్ప సినిమాకు అరుదైన గౌరవం

Pushpa Movie - పుష్ప సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. బెర్లిన్ చిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

Pushpa | పుష్ప సినిమాకు అరుదైన గౌరవం
X

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఇండియ‌న్ సినిమా పుష్ప ది రైజ్ ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ఇండియ‌న్ సినిమా త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం అల్లు అర్జున్‌కు ద‌క్కిన విష‌యం తెలిసిందే.

ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న ఇటీవ‌ల బెర్లిన్ 74వ ఇంట‌ర్నేష‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొనేందుకు జ‌ర్మ‌నీకి వెళ్లాడు. ప్ర‌స్తుతం ఐకాన్‌స్టార్ బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఉన్నాడు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది పుష్ప-1-ది రైజ్ సినిమా. ఇది ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు.. బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది.

ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 తెరకెక్కుతోంది. ఆగస్ట్ 15న ఇది థియేటర్లలోకి వస్తుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.






First Published:  17 Feb 2024 12:55 PM GMT
Next Story