Telugu Global
Cinema & Entertainment

మరో రికార్డ్ సృష్టించిన పుష్ప

పుష్ప మేనరిజమ్స్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పాటలు కూడా అదే స్థాయిలో సంచలనం రేపాయి.

మరో రికార్డ్ సృష్టించిన పుష్ప
X

పుష్ప సినిమా మరో అరుదైన రికార్డు అందుకుంది. ఇప్పటికే పుష్ప మేనరిజమ్స్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇప్పుడు పాటలు కూడా అదే స్థాయిలో సంచలనాలు సృష్టించాయి. పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట.

ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో అల్లు అర్జున్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప ఆల్బమ్ అన్నిచోట్లా అద్భుతాలు చేసింది. దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డా, ఊ అంటావా ఊఊ అంటావా పాటలకు ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ వచ్చింది. అలాగే సోషల్ మీడియా రీల్స్‌లో శ్రీవల్లి స్టెప్ సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

దీనికి ముందు బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమా కూడా మ్యూజికల్‌గా సంచలనాలు సృష్టించింది. పుష్ప దాన్ని కంటిన్యూ చేసింది. పుష్ప తనకు మైల్ స్టోన్ మూవీ అవుతుందని ముందు నుంచి చెప్తూ వస్తున్నాడు అల్లు అర్జున్. అలా ఆయన చెప్పిన ప్రతీ అంచనా నిజమైందిప్పుడు.

బన్నీ నమ్మకాన్ని నిజం చేస్తూ, పుష్ప ఏకంగా 350 కోట్లు వసూలు చేసింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా పుష్ప తరహాలో తగ్గేదే లే అన్నారు.. ఇంకా అంటూనే ఉన్నారు. అంతేకాదు రాజకీయ నాయకులు సైతం పుష్ప మేనరిజమ్స్ వాడుకుంటూనే ఉన్నారు.

First Published:  14 July 2022 10:07 AM GMT
Next Story