Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 Movie: పుష్ప ఎక్కడున్నాడో తెలిసిపోయింది!

Pushpa 2 Movie New Video: బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, పుష్ప-2 నుంచి కొత్త వీడియో రిలీజ్ చేశారు. సినిమాకు సంబంధించి చాలా విషయాలు వెల్లడించారు.

Pushpa 2 Movie: పుష్ప ఎక్కడున్నాడో తెలిసిపోయింది!
X

Pushpa 2 Movie: పుష్ప ఎక్కడున్నాడో తెలిసిపోయింది!

బుల్లెట్ గాయాలతో పుష్ప తప్పించుకున్నాడంటూ కొన్ని రోజుల కిందట చిన్న వీడియో రిలీజ్ చేసింది యూనిట్. అందులో బైక్ పై పుష్ప పారిపోతున్నట్టు విజువల్ చూపించారు. ఇంతకీ పుష్ప ఏమయ్యాడు? 8 బుల్లెట్లు తగిలిన పుష్పరాజ్ బతికే ఉన్నాడా? ఈ ప్రశ్నలకు ఈరోజు సమాధానం ఇచ్చారు.

ఈరోజు పుష్ప-2 నుంచి ఫుల్ లెంగ్త్ వీడియో రిలీజైంది. 3 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో పుష్ప తప్పించుకోవడం, అడవుల్లోకి పారిపోవడం, పుష్ప ఏమయ్యాడో తెలియక అతడి మద్దతుదారులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించడం లాంటి సన్నివేశాల్ని చూపించారు.

వీటితో పాటు వీడియో చివర్లో.. అడవుల్లో ముసుగు కప్పుకొని పుష్ప కనిపించిన దృశ్యాన్ని రివీల్ చేశారు. "అడవిలో జంతులు 2 అడుగులు వెనక్కు వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చిండాడని అర్థం." అనే పవర్ ఫుల్ డైలాగ్ తో పుష్ప బతికే ఉన్నట్టు చూపిస్తారు. అదే టైమ్ లో పుష్ప స్వాగ్ ను కూడా చూపించి సినిమాపై అంచనాల్ని పెంచారు.

ఇక వీడియో చివర్లో మరో పంచ్ కూడా పెట్టారు. "ఇది పుష్ప గాడి రూలు" అంటూ బన్నీతో డైలాగ్ చెప్పించారు. వీడియోలో సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మొత్తమ్మీద వేర్ ఈజ్ పుష్ప అంటూ ఈరోజు విడుదల చేసిన వీడియో పార్ట్-2పై అంచనాలు పెంచేసింది. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు.



First Published:  7 April 2023 3:18 PM GMT
Next Story