Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 - పుష్ప 2 షూటింగ్ అప్ డేట్స్

Pushpa 2 Movie Latest Updates- అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప-2. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

Pushpa 2 Movie: పుష్ప ఎక్కడున్నాడో తెలిసిపోయింది!
X

Pushpa 2 Movie: పుష్ప ఎక్కడున్నాడో తెలిసిపోయింది!

పుష్ప-2 సినిమా ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడీ యూనిట్ మరోసారి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. తాజాగా అక్కడ మరో షెడ్యూల్ మొదలైంది. నటుడు ఫహాద్ ఫాజిల్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు

సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ మూవీలో రష్మిక హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అనసూయ, సునీల్, రావు రమేష్, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

పుష్ప-2 సెట్స్ పైకి వచ్చి చాన్నాళ్లయింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మరోసారి మేకోవర్ అయ్యాడు. మళ్లీ జుట్టు, గడ్డం పెంచాడు. ఇప్పటికే బన్నీపై కొన్ని కీలక సన్నివేశాలు తీసిన సుకుమార్, త్వరలోనే బన్నీ-ఫాజిల్ కాంబినేషన్ లో మరో కీలకమైన షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నాడు.

పుష్ప-1 సినిమా దేశవ్యాప్తంగా హిట్టయింది. దీంతో పుష్ప-2పై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఆడియో రైట్స్, 60 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయాయి. దేశంలో ఏ సినిమాకూ ఇప్పటివరకు ఇంత భారీ మొత్తం దక్కలేదు.

First Published:  9 May 2023 3:06 AM GMT
Next Story