Telugu Global
Cinema & Entertainment

పూజా కార్యక్రమాలతో మొదలైన పుష్ప-2

అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ స్టార్ట్ అయింది. పుష్ప-2 ఈరోజు లాంఛనంగా మొదలైంది.

పూజా కార్యక్రమాలతో మొదలైన పుష్ప-2
X

అల్లు అర్జున్ హీరోగా విలక్షణ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. 350 కోట్లకు పైగా వసూలు చేసి అల్లు అర్జున్ కెరీర్ అతిపెద్ద విజయంగా నిలిచింది.

సినిమా కంటే కూడా పుష్ప మేనియా ప్రపంచాన్ని ఊపేసింది. అందులోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనపై ప్రశంశల వర్షం కురిసింది. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా పుష్ప సంచలన విజయం సాధించింది. కరోనా సమయంలో కూడా 100 కోట్లకు పైగా వసూలు చేసి.. అల్లు అర్జున్ అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది పుష్ప.

మొదటి భాగం చూసి ఎంతోమంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్, సుకుమార్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు రెండో భాగం రాబోతోంది. పుష్ప సీక్వెల్, పుష్ప-ది రూల్ ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది.

గ్రాండ్ గా జరిగిన ఈ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ హాజరుకాలేదు. అతడు నేరుగా సెట్స్ పైకి వస్తాడు. ఈరోజు జరిగిన ప్రారంభోత్సవంలో సుకుమార్ తో పాటు నిర్మాతలు, డైరక్షన్ డిపార్ట్ మెంట్ సభ్యులు పాల్గొన్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుంది.





First Published:  22 Aug 2022 1:02 PM GMT
Next Story