Telugu Global
Cinema & Entertainment

Pushpa 2: లీకులపై యూనిట్ సీరియస్

Pushpa 2 leaks - పుష్ప-2 యూనిట్ కు ఇప్పుడు కొత్త తలనొప్పి పట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఫొటోలు లీక్ అవుతున్నాయి.

Pushpa 2: లీకులపై యూనిట్ సీరియస్
X

పాన్ ఇండియా లెవెల్లో పుష్ప సినిమా హిట్టవ్వడంతో, పుష్ప-2పై అందరి చూపు పడింది. కాస్త లేట్ అయినప్పటికీ, ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ప్రస్తుతం విశాఖ పరిసర ప్రాంతాల్లో పుష్ప-2కు సంబంధించి కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు, వైజాగ్ వచ్చిన బన్నీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

ఇదిలా ఉండగా, పుష్ప యూనిట్ ను ఇప్పుడో సమస్య బాగా ఇబ్బంది పెడుతోంది. అదే లీకుల గోల. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు బయటకొచ్చేస్తున్నాయి. షూటింగ్ టైమ్ లో స్టిల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. దీనిపై యూనిట్ సీరియస్ గా ఉంది.

ఈ లీకులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది పుష్ప టీమ్. ఇకపై లొకేషన్ కు సెల్ ఫోన్లు అనుమతించకూడదని అనుకుంటోంది. అయితే ఇంకా ఈ నిర్ణయాన్ని అమలు చేయలేదు. ఎందుకంటే, యూనిట్ దగ్గర సెల్ ఫోన్లు లేకపోయినా, షూటింగ్ స్పాట్ కు వస్తున్న అభిమానుల దగ్గర ఫోన్లు ఉంటాయి కదా, అలా పుష్ప-2 లొకేషన్ స్టిల్స్ లీక్ అయిపోతున్నాయి.

రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. వచ్చేనెల నుంచి రష్మిక సెట్స్ పైకి రాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది పుష్ప-2.

First Published:  24 Jan 2023 5:12 PM GMT
Next Story