Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 - మరో కీలక షెడ్యూల్ పూర్తి

Pushpa 2 - పుష్ప 2 నుంచి మరో క్రేజ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది.

Pushpa 2 - మరో కీలక షెడ్యూల్ పూర్తి
X

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప-2 నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. తాజాగా పుష్ప-2కు సంబంధించి మరో షెడ్యూల్ పూర్తి చేశారు.

పుష్ప చిత్రంలో మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర అందరిని ఎంతగానో అలరించింది. పార్టీ లేదా పుష్ప అంటూ ఆయన చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగంతి తెలిసిందే. పుష్ప-2లో కూడా ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉండబోతున్న సంగతి విదితమే.

గత కొన్ని రోజులుగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఫహాద్ ఫాజిల్‌పై సుకుమార్ దర్శకత్వంలో ముఖ్య సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇటీవలే ఆ షెడ్యూల్ పూర్తయింది. దీనికి సంబంధించిన ఓ స్టిల్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఫహద్‌ఫాజిల్‌తో దర్శకుడు సుకుమార్ కనిపిస్తున్న ఈ స్టిల్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి రాబోతున్నాడు అంటూ క్యాప్షన్‌ను కూడా జత చేశారు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బన్నీ ఫస్ట్ లుక్ రిలీజైంది. అది వైరల్ అయిన సంగతి తెలిసిందే.

First Published:  18 May 2023 3:53 PM GMT
Next Story