Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 | పుష్పగాడి జాతర మొదలైంది

Pushpa 2 - బన్నీ హీరోగా పుష్ప-2 సినిమా షూటింగ్ చాన్నాళ్లుగా నడుస్తోంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి కీలకమైన షెడ్యూల్ మొదలైంది.

Pushpa 2 Movie: పుష్ప ఎక్కడున్నాడో తెలిసిపోయింది!
X

Pushpa 2 Movie: పుష్ప ఎక్కడున్నాడో తెలిసిపోయింది!

పుష్ప 2 సినిమా జాతర ఎపిసోడ్ మొదలైంది. మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. పోస్టర్‌లో అల్లు అర్జున్ పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించినట్లుగా, సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది . ఐకాన్ స్టార్ ఈ లుక్ సినిమా ఇంటర్వెల్‌లో ఉండే జాతర ఎపిసోడ్‌లో వస్తుంది.

ఇప్పుడు, పుష్ప 2 బృందం ఈ జాతర ఎపిసోడ్ కోసం భారీ షెడ్యూల్ను ప్రారంభించింది. ఇందుకోసం భారీ సెట్‌ వేసి, ఓ పాట, ఫైట్‌ ఎపిసోడ్‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ముందుగా ఓ పాటను షూట్ చేసి, ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారు.

జాతర ఎపిసోడ్‌లో వచ్చే ఈ పాట కోసం ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, 400 మందికి పైగా డ్యాన్సర్లు వివిధ ప్రాంతాల నుండి జాయిన్ అయ్యారు. ఇది సినిమాకే హైలెట్. మాస్ ప్రేక్షకులకు విందు.

మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఇప్పటికే హైలెట్ అయింది. పుష్ప-2లో ఈ రెండు పాత్రల మధ్య ఘర్షణ హైలెట్. మొదటి పార్ట్ కంటే ఎక్కువ యాక్షన్ ఉంటుంది. ఇందులో రష్మిక మందన్న కూడా కథానాయికగా నటిస్తోంది. పుష్ప ది రైజ్‌లోని శ్రీవల్లి పాత్రలో ఆమె మళ్లీ నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నాడు. సీక్వెల్ కోసం కూడా మంచి ట్రాక్స్ రెడీ చేశాడు.

First Published:  9 Nov 2023 4:08 PM GMT
Next Story