Telugu Global
Cinema & Entertainment

Dunki | షారూక్ సినిమా నుంచి ప్రచారం గీతం రిలీజ్

Dunki - షారూక్ తాజా చిత్రం డంకీ. ఈ సినిమా నుంచి ప్రచార గీతాన్ని విడుదల చేశారు.

Dunki | షారూక్ సినిమా నుంచి ప్రచారం గీతం రిలీజ్
X

షారూక్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాని కలయికలో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. డిసెంబర్ 21న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘ఓ మాహీ..’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో కింగ్ ఖాన్‌ షారూక్, తాప్సీ తమ ప్రేమ మాధుర్యాన్ని చూపించారు.

ఇటీవల ‘డంకీ డ్రాప్ 4’ అంటూ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో రాజ్‌కుమార్ హిరాని ఓ అందమైన ప్రపంచాన్ని ఎలా ఉంటుందనే విషయాన్ని చూశారు. హిందీ సినిమా చరిత్రలో 24 గంటల వ్యవధితో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా ఇది కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

ఈ అంచనాల్ని మరింత పెంచేలా ‘ఓ మాహీ..’ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరోహీరోయిన్ల స్వచ్చమైన ప్రేమను చూపించారు. ‘ఓ మాహీ..’ సాంగ్‌ను మ్యూజికల్ మ్యాస్ట్రో ప్రీతమ్ కంపోజ్ చేశారు. ఇర్షాద్ కమిల్ రాసిన ఈ పాటను అర్జిత్ సింగ్ అద్భుతంగా ఆలపించారు. ‘ఓ మాహీ..’ సాంగ్ ఏడారి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. దుబాయ్, అబుదాబిలో ఈ సాంగ్ తీశారు.

First Published:  12 Dec 2023 4:41 PM GMT
Next Story