Telugu Global
Cinema & Entertainment

Prabhas Project k Poster: ప్రాజెక్ట్-కె నుంచి ఆసక్తికర పోస్టర్

Prabhas Project k Poster: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, ప్రాజెక్ట్-కె సినిమా నుంచి ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు. అదేంటో చూద్దాం..

ప్రాజెక్ట్-కె సినిమా పోస్టర్
X

ప్రాజెక్ట్-కె సినిమా పోస్టర్

Prabhas Project k Poster: రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలుపుతూ, అతని చేయి శక్తిని చూపించే పోస్టర్‌ను టీమ్ ప్రాజెక్ట్-కె విడుదల చేసింది. సూపర్ హీరోలా ఆర్మ్ గార్డ్ ధరించి, ప్రభాస్ ఏదో గట్టిగా కొట్టడం, ఆ పంచ్ శక్తి పవర్ ఫుల్ గా ఉండడం, ఈ పోస్టర్ లో అంతర్లీనంగా కనిపిస్తుంది.

'హీరోలు పుట్టరు, ఎదుగుతారు' అని క్యాప్షన్ ను పోస్టర్‌పై చూడొచ్చు. మేకర్స్ అంతకుముందు అమితాబ్ బచ్చన్ చేతిని చూపించే పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ప్రభాస్ చేయితో పోస్టర్ ను విడుదల చేశాడు.

ఈ పోస్టర్ పై పెద్దగా అంచనాలు పెంచలేదు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సింపుల్ గా ఓ చిన్న పోస్టర్ వస్తుందని మాత్రమే చెప్పాడు. చాలామంది ప్రాజెక్ట్-కె నుంచి ప్రభాస్ లుక్ వస్తుందని అనుకున్నారు. కానీ దానికి ఇంకా చాలా టైమ్ ఉంది.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోంది ప్రాజెక్ట్-కె. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది.




First Published:  23 Oct 2022 4:18 PM GMT
Next Story