Telugu Global
Cinema & Entertainment

Project K | కామిక్ కాన్ కు ప్రభాస్-కమల్ హాసన్

Project K - ప్రాజెక్ట్-కె హంగామా మొదలైంది. కామిక్-కాన్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు.

Project K | కామిక్ కాన్ కు ప్రభాస్-కమల్ హాసన్
X

ప్రభాస్, నాగ్ అశ్విన్ ల సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ K'. ఎన్నో ఆకర్షణలతో ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి తారలు ఈ సినిమాలో నటిస్తున్నారు.

ప్రాజెక్ట్ K.. శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రం. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ అక్కడ జరిగే ఈవెంట్ లో భారత కాలమానం ప్రకారం జూలై 20న అమెరికాలో, జూలై 21న ఇండియాలో విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌ లు పిడికిలి షేక్ చేయడం కనిపిస్తోంది.

ఈ వేడుకకు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ K. ఈ సినిమాతో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది ఈ సంస్థ.

దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  16 July 2023 2:59 PM GMT
Next Story