Telugu Global
Cinema & Entertainment

Project K - ప్రభాస్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

Project K Movie - ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్-కె. ఈ సినిమా షూటింగ్ 70శాతం కంప్లీట్ అయిందంట.

Project K - ప్రభాస్ మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

ఏ సినిమా అప్ డేట్ అయినా తెలుస్తుంది కానీ, ప్రాజెక్టు-కె అప్ డేట్ మాత్రం తెలియడం లేదు. గమ్మత్తైన విషయం ఏంటంటే యూనిట్ లో కూడా చాలామందికి ఈ సినిమా ఎంత వరకు వచ్చిందనే విషయం తెలియదు. కొన్నాళ్లు రీసెర్చ్ చేయడం, మరికొన్ని రోజులు షూట్ చేయడం.. ఇలా సాగుతోంది ప్రాజెక్ట్-కె సినిమా.

ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది. ప్రాజెక్ట్-కె షూటింగ్ దాదాపు 70శాతం పూర్తయిందట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ కూడా జోరుగా సాగుతున్నాయట. నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ప్రభాస్, దీపిక పదుకోన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్-కె. ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా. పైగా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అందుకే ఈ సినిమా కోసం కాస్ట్యూమ్స్ నుంచి ప్రతిది కొత్తగా డిజైన్ చేస్తున్నారు. అందుకే టైమ్ పడుతోంది. అయినప్పటికీ 70శాతం షూట్ పూర్తవ్వడం గొప్ప విషయమే.

వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రాజెక్ట్-కె థియేటర్లలోకి రాబోతోంది. అంతకంటే ముందు ప్రభాస్ నుంచి ఆదిపురుష్, సలార్ సినిమాలు రాబోతున్నాయి.

First Published:  7 May 2023 1:21 PM GMT
Next Story