Telugu Global
Cinema & Entertainment

అరకొర సమ్మె.. మరో 6 రోజుల్లో ఎత్తేస్తారంట!

టాలీవుడ్ లో ప్రస్తుతం అరకొరగా సాగుతున్న సినిమా షూటింగ్ ల బంద్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఈ బంద్ ను ఎత్తేయాలని నిర్మాతలు నిర్ణయించారు.

అరకొర సమ్మె.. మరో 6 రోజుల్లో ఎత్తేస్తారంట!
X

టాలీవుడ్ లో ప్రస్తుతం సమ్మె జరుగుతోంది. షూటింగ్స్ ఆపేశారు. అయితే ఇది పూర్తిస్థాయి షూటింగ్స్ నిషేధం కాదు. కొంతమంది నిర్మాతలు పట్టుదలకు పోయి, తమ సినిమాల షూటింగ్స్ ఆపేసుకున్నారు. మిగతా సినిమాల షూటింగ్స్ అన్నీ యదేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పుడీ అరకొర సమ్మెను కూడా ఎత్తేస్తున్నారు.

24వ తేదీ నుంచి ఆగిన సినిమాల షూటింగ్స్ అన్నీ మళ్లీ మొదలుకాబోతున్నాయి. ఇందులో భాగంగా పవన్, ప్రభాస్ సినిమాలు సెట్స్ పైకి రాబోతున్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే.. సమ్మె దిగ్విజయంగా పూర్తయిందని చెప్పుకునేందుకు ఓ మీడియం రేంజ్ స్టార్ హీరో సినిమాను బలవంతంగా ఆపేస్తున్నారు. లెక్కప్రకారం ఆ హీరో సినిమా ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి రావాలి. 24వ తేదీ నుంచి షూటింగ్ పెట్టుకోమని బుజ్జగిస్తున్నారు. ఇలా సాగుతోంది టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ ప్రక్రియ.

టాలీవుడ్ లో నలుగుతున్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం కొంతమంది నిర్మాతలు తమ సినిమాల షూటింగ్స్ ఆపేశారు. ముఖ్యంగా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింపు, నటీనటుల పారితోషికాల తగ్గింపు లాంటి అంశాలపై చర్చించాలని కూర్చున్నారు. సినిమాల్ని ఓటీటీకి ఎన్ని రోజుల్లో ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు కానీ, రెమ్యూనరేషన్లపై మాత్రం తేల్చలేకపోయారు. దీంతో ఓ కమిటీని వేసి 24 నుంచి తిరిగి షూటింగ్స్ మొదలుపెట్టబోతున్నారు.

దాదాపు 90శాతం షూటింగ్స్ జరుగుతూ, కొన్ని సినిమాల షూటింగ్స్ ఆపేయడం వల్ల ఉపయోగం లేదని నిర్మాతలు భావించారు. పైగా టాలీవుడ్ కు వరుసగా హిట్స్ వస్తున్న నేపథ్యంలో, షూటింగ్స్ ను యథాతథంగా కొనసాగించడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఈ మేరకు మరికాసేపట్లో నిర్మాతల మండలి ప్రెస్ మీట్ నిర్వహించనుంది.

First Published:  18 Aug 2022 10:23 AM GMT
Next Story