Telugu Global
Cinema & Entertainment

Producer SKN | నిర్మాతగా అప్పర్-ప్రైమరీ స్కూల్ లో ఉన్నాను

Producer SKN - నిర్మాత ఎస్ కే ఎన్, తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి వివరించాడు. బేబి హిందీ రీమేక్ పై చాలా నమ్మకంగా ఉన్నాడు.

Producer SKN | నిర్మాతగా అప్పర్-ప్రైమరీ స్కూల్ లో ఉన్నాను
X

ప్రతి రోజు పండగే, ట్యాక్సీ వాలా, బేబి వంటి బ్లాక్ బస్టర్, కల్ట్ సినిమాలతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు ఎస్ కేఎన్. ఆయన తన స్నేహితుడు డైరెక్టర్ మారుతితో కలిసి తమిళ మూవీ లవర్ ను "ట్రూ లవర్" పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సినిమాను విభిన్న ప్రేమ కథతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటించారు. "ట్రూ లవర్" సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత ఎస్ కేఎన్.. తన అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి వెల్లడించాడు.

"బేబి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాం. మరో ఒకట్రెండు వారాల్లో అనౌన్స్ చేస్తాం. కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాను. హిందీలో స్టార్ కిడ్స్ లేదా కొత్త వాళ్లతో బేబీ రీమేక్ చేయాలనుకుంటున్నాం. సాయి రాజేశ్ హిందీలో డైరెక్టర్ చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి ఇక్కడి కంటే హిందీలో పెద్ద హిట్టయింది. బేబి కూడా అలాగే బాలీవుడ్ లో పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నా."

బేబి హిందీ రీమేక్ తో పాటు.. సంతోష్ శోభన్, ఆనంద్ దేవరకొండతో సినిమాలు చేస్తున్నాడు ఎక్ కేఎన్. అలాగే ఓ సూపర్ నేచురల్ మూవీ కూడా లైన్లో ఉంది. దర్శకుడు సందీప్ రాజ్ తో కూడా ఓ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. ప్రొడ్యూసర్ గా అప్పర్ ప్రైమరీ స్థాయిలో ఉన్నానని.. కాలేజ్ స్థాయికి వచ్చాక అల్లు అర్జున్ తో సినిమా నిర్మిస్తానని ప్రకటించాడు ఈ ప్రొడ్యూసర్.

First Published:  7 Feb 2024 1:34 AM GMT
Next Story