Telugu Global
Cinema & Entertainment

వాడివాసల్ ఆగిపోలేదు.. వదంతులు నమ్మొద్దు..!

సూర్య- వెట్రిమారన్ కాంబినేషన్లో వాడివాసల్ ప్రకటించి రోజులు గడిచినప్పటికీ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్న కలైపులి ఎస్.థాను తాజాగా స్పందించారు. వాడివాసల్ సినిమా షూటింగ్ ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు.

వాడివాసల్ ఆగిపోలేదు.. వదంతులు నమ్మొద్దు..!
X

ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ పంటి వరుస విజయాల తర్వాత తమిళ అగ్ర హీరో సూర్య మరో భారీ ప్రాజెక్టుగా వాడివాసల్ మూవీని ప్రకటించారు. తమిళ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ ఈ మూవీకి దర్శకుడు. తమిళ సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా సూర్య - బాల కాంబినేషన్లో కొద్దిరోజుల కిందట ఓ సినిమా ప్రకటించారు. అయితే ఆ సినిమా నుంచి సూర్య ఇటీవల వైదొలిగారు.

సూర్య- వెట్రిమారన్ కాంబినేషన్లో వాడివాసల్ ప్రకటించి రోజులు గడిచినప్పటికీ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్న కలైపులి ఎస్.థాను తాజాగా స్పందించారు. వాడివాసల్ సినిమా షూటింగ్ ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్నట్లు తెలిపారు. కొంతమంది నిమిషాల్లో ఫేమ్ పొందేందుకు అసత్య ప్రచారాలు చేస్తుంటారని, వాటిని ప్రేక్షకులు నమ్మవద్దని ఆయన కోరారు.

ప్రస్తుతం సూర్య తన 42వ సినిమాగా శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని పది భాషల్లో విడుదల చేయనున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే వాడివాసల్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

First Published:  24 Dec 2022 8:31 AM GMT
Next Story