Telugu Global
Cinema & Entertainment

SreeLeela: మహేష్ సినిమాలో శ్రీలీల ఫిక్స్, నిర్మాత ప్రకటన

Producer confirmed Sreeleela as second lead in Mahesh trivikram movie. మహేష్ బాబు సినిమాలో శ్రీలీల ను అధికారికంగా ఫిక్స్ చేశాడు నిర్మాత నాగ వంశీ

SreeLeela: మహేష్ సినిమాలో శ్రీలీల ఫిక్స్, నిర్మాత ప్రకటన
X

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో శ్రీలీల ఉందా లేదా? దీనిపై దాదాపు నెల రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. శ్రీలీల పక్కాగా ఉందంటూ ఆమధ్య చిన్నపాటి క్లారిటీ కూడా వచ్చింది. అయినప్పటికీ పుకార్లు ఆగలేదు. తాజాగా ఈ ఊహాగానాలకు చెక్ పెట్టింది యూనిట్. తమ సినిమాలో శ్రీలీల ఉందంటూ క్లారిటీ ఇచ్చారు.


త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయాల్సిన సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు. సెకెండ్ హీరోయిన్ గా శ్రీలీలను ఫిక్స్ చేశారు. ఈ విషయాల్ని స్వయంగా నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. అంతేకాదు, ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేయబోతున్నట్టు కూడా తెలిపాడు నాగవంశీ.


18వ తేదీ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ మూవీకి బల్క్ కాల్షీట్లు కేటాయించాడు మహేష్. సినిమా కోసం ఇప్పటికే 3 భారీ సెట్స్ సిద్ధం చేశారు. ఆ సెట్స్ లోనే నాన్-స్టాప్ గా సినిమా షూటింగ్ ను పూర్తిచేయబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.


ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి స్వింగ్ లో ఉంది శ్రీలీల. తాజాగా ధమాకాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టింది. చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఇలాంటి టైమ్ లో మహేష్ బాబు సినిమాలో ఆఫర్ అందుకుంది ఈ బ్యూటీ.

First Published:  16 Jan 2023 7:38 AM GMT
Next Story