Telugu Global
Cinema & Entertainment

Priyadarshi | ఓం భీష్ బుష్ అందర్నీ అలరిస్తుంది

Priyadarshi - ఓం భీమ్ బుష్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ప్రియదర్శి. ఈసారి కామెడీ పక్కా అంటున్నాడు.

Priyadarshi | ఓం భీష్ బుష్ అందర్నీ అలరిస్తుంది
X

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా.. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్'. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాను వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో హీరో ప్రియదర్శి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నాడు.

"దర్శకుడు హర్ష 'హుషారు' సినిమా నుంచే పరిచయం. నేను తన గత చిత్రాలలో పని చేయాల్సింది కానీ కుదరలేదు. 'ఓం భీమ్ బుష్' కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. శ్రీ విష్ణు, రాహుల్ అనేసరికి ఇంకా ఆసక్తి పెరిగింది. అలాగే యువీ లాంటి బలమైన నిర్మాణ సంస్థ ఉండటం.. ఇలా అన్నీ కుదిరాయి. కథలో చాలా ఇంట్రస్టింగ్ ఐడియా ఉంది. దానికి ఫాంటసీ, హారర్ ఎలిమెంట్ కూడా యాడ్ చేయడం ఇంకా క్రేజీగా అనిపించింది.."

ఓంభీష్ బుష్ కచ్చితంగా హిట్ అవుతుందంటున్న ప్రియదర్శి.. ఇందులో తన పాత్ర ఎలా ఉంటుందనే విషయాన్ని బయటపెట్టాడు. మీడియాలో వినిపిస్తున్న కొన్ని సందేహాల్ని కూడా కొట్టిపారేశాడు.

"ఇందులో నా పాత్ర పేరు డా. వినయ్ గుమ్మాడి. మా ఫ్రెండ్స్ అంతా ఉస్మానియాలో పీహెచ్డీ చేయాలనీ చేరుతాం. కానీ ముఖ్య ఉద్దేశం మాత్రం అక్కడ వచ్చే స్టయిఫండ్ , ఉచిత హాస్టల్ సౌకర్యం కోసం. నాది సైన్స్ ని నమ్మే పాత్ర. మిగతా ఇద్దరు మాత్రం మంత్రాలు, తంత్రాలని నమ్ముతారు. అలా మా ముగ్గురి మధ్య మంచి హ్యుమర్ పుడుతుంది. సినిమా అంతా ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. మేం ముగ్గురం కలసి బ్రోచేవారెవరురా చేశాం. దానికి 'ఓం భీమ్ బుష్' కి ఎక్కడా పోలిక ఉండదు."

సినిమా మొత్తం కామెడీగా ఉన్నప్పటికీ.. క్లయిమాక్స్ లో మాత్రం అదిరిపోయే ఎమోషన్, డ్రామా ఉంటాయని చెబుతున్నాడు ప్రియదర్శి.

First Published:  18 March 2024 5:38 PM GMT
Next Story