Telugu Global
Cinema & Entertainment

Priya Prakash Varrier | ప్రియా ప్రకాష్ కు పవన్ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది?

Priya Prakash Varrier - బ్రో సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా నటించింది. మరి ఆమెకు ఈ సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది?

Priya Prakash Varrier | ప్రియా ప్రకాష్ కు పవన్ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది?
X

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాత. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు.

కేతిక శర్మకు మెగా కాంపౌండ్ తో ఆల్రెడీ కనెక్షన్ ఉంది. కాబట్టి బ్రో సినిమాలోకి ఆమె వచ్చిందని అనుకోవచ్చు. మరి ఎలాంటి కనెక్షన్ లేని, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలోకి ఎలా ఎంటరైంది?

"మా అమ్మ సూచనతో నేను అప్పటికే ఒరిజినల్ మూవీ వినోదయ సిత్తం చూశాను. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. బ్రో కోసం సముద్రఖని గారు ఫోన్ చేసి లుక్ టెస్ట్ కోసం రమ్మన్నారు. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లు పరిశీలించి, చివరికి నన్ను ఎంపిక చేశారు. నాలాంటి కొత్తమ్మాయికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగమయ్యే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి అగ్ర నటులతో ఒకట్రెండు సన్నివేశాల్లో నటించడమే నాలాంటి వారికి గర్వంగా ఉంటుంది."

ఇలా బ్రో సినిమాలో తన ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది ప్రియా ప్రకాష్ వారియర్. దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో విఫలమైంది ప్రియా ప్రకాష్. దీనిపై కూడా ఆమె స్పందించింది.

"నాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. నన్ను సరైన మార్గంలో గైడ్ చేసేవాళ్ళు లేరు. కన్ను గీటే వీడియో తర్వాత అందరూ రకరకాల సలహాలు ఇవ్వడంతో కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఇప్పుడు ఈ ప్రయాణంలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు పాత్రలు, సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు గొప్ప నటి కావాలని ఆశ ఉండేది. ఆ దిశగానే నా అడుగులు సాగుతున్నాయి."

28న థియేటర్లలోకి వస్తోంది బ్రో సినిమా. తమిళ్ లో రిలీజైన వినోదాయ శితం సినిమాకు రీమేక్ గా ఇది వస్తుంది. కథ లైన్ మాత్రమే తీసుకొని, పూర్తిగా స్క్రీన్ ప్లే మార్చేశాడు త్రివిక్రమ్.

First Published:  20 July 2023 8:40 AM GMT
Next Story