Telugu Global
Cinema & Entertainment

Premalu | తెలుగులోకి సూపర్ హిట్ మలయాళం సినిమా

Premalu Telugu - మలయాళంలో సూపర్ హిట్టయింది ప్రేమలు సినిమా. ఇప్పుడీ సినిమా తెలుగులోకి రాబోతోంది. స్వయంగా కార్తికేయ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.

Premalu | తెలుగులోకి సూపర్ హిట్ మలయాళం సినిమా
X

2024లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథాశంతో తెరకెక్కిన ‘ప్రేమలు’ సినిమా స్టోరీ లైన్, దాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.

తెలుగు ప్రేక్షకులు సైతం ‘ప్రేమలు’ సినిమా చూసి చాలా బావుందని అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టటమే కాకుండా ‘ప్రేమలు’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుండటం విశేషం.

మార్చి 8న ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటంతో అభిమానులు ఎంతో ఆతృతగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

ట్రైలర్‌ను గమనిస్తే హైదరాబాద్ ట్రైన్‌లో ప్రయాణిస్తోన్న నెల్సన్, మమిత పాత్రలను చూపించటంతో ప్రారంభమవుతుంది. అలాగే మమిత నిద్రపోతున్న సమయంలో నెల్సన్ ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. అక్కడి నుంచి నెల్సన్, మమిత మనసుని ఎలా గెలుచుకున్నాడనే జర్నీ ప్రారంభం అవుతుంది. నెల్సన్ పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. వీరిద్దరితో పాటు ఇతర పాత్రలను కూడా ట్రైలర్ లో చూపించారు.

ట్రయిలర్ లో ‘తొక్కుకుంటూ పోవాలే’ అనే ఆర్ఆర్ఆర్ డైలాగ్ తో పాటు ఈ మధ్య పాపులర్ అయిన కుమారి ఆంటీ ప్రస్తావన వినోదాత్మకంగా ఉంది. ఫన్ రైడర్‌లా అనిపిస్తోన్న ‘ప్రేమలు’ ట్రైలర్ చూస్తుంటే సినిమా మరింత వినోదాత్మకంగా మార్చి 8న అలరిస్తుందనిపిస్తోంది.

First Published:  3 March 2024 7:13 AM GMT
Next Story