Telugu Global
Cinema & Entertainment

Prema Vimanam | ఓటీటీలోకి నేరుగా మరో మూవీ

Prema Vimanam - సంగీత్ శోభన్ హీరోగా నటించిన సినిమా ప్రేమ విమానం. ఈ మూవీ థియేటర్లలోకి రావడం లేదు. నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది.

Prema Vimanam | ఓటీటీలోకి నేరుగా మరో మూవీ
X

భారీ బడ్జెట్ సినిమాలు తీసే అభిషేక్ పిక్చర్స్ సంస్థ, జీ 5 తో కలిసి ఓ సినిమా ప్రొడ్యూస్ చేసింది. దీని పేరు ‘పేమ విమానం’. అక్టోబర్ 13న ఈ సినిమా జీ5లో నేరుగా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. విమానం ఎక్కాలని కలలుకనే ఇద్దరు చిన్న పిల్లలు.. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు.. ఇలా అన్నీ ఈ సినిమాలో ఉంటాయంటున్నారు మేకర్స్.

సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా కొడుకులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ ఫిల్మ్‌కి సంతోష్ కటా దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు.

వెబ్ ఫిలిమ్స్ అన్నీ ఎమోషనల్ గా ఉంటాయి. ప్రేమ విమానంలో కూడా ఎమోషన్ ఉంది. కాకపోతే అంతకుమించి లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు మేకర్స్.

నిజానికి ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించాడు అభిషేక్ నామా. లో-బడ్జెట్ లో తీసి, తక్కువ రేట్లకే సినిమాను అమ్మడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులోకి జీ గ్రూప్ ఎంటర్ అయిందో, అప్పుడిది వెబ్ మూవీగా మారింది. చాన్నాళ్ల కిందటే రెడీ అయిన ఈ సినిమా ఎట్టకేలకు నెటిజన్ల ముందుకు వస్తోంది.

First Published:  16 Sep 2023 4:16 PM GMT
Next Story