Telugu Global
Cinema & Entertainment

ప్రేమ విమానం మొదలుపెట్టిన హిట్ ప్రొడ్యూసర్

సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ హీరోగా మారాడు. ప్రేమ విమానం అనే సినిమా స్టార్ట్ చేశాడు.

ప్రేమ విమానం మొదలుపెట్టిన హిట్ ప్రొడ్యూసర్
X

దర్శకుడు శోభన్ అకాల మరణం తర్వాత అతడి కొడుకులు అతి కష్టమ్మీద సినీరంగంలో రాణిస్తున్నారు. ఇందులో భాగంగా సంతోష్ శోభన్ ఆల్రెడీ సెట్ అయ్యాడు. చిన్న సినిమాలే అయినప్పటికీ అతడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఏక్ మినీ కథతో అతడి దశ తిరిగింది. ఇప్పుడు అతడి తమ్ముడు సంగీత్ శోభన్ వంతు వచ్చింది.

జీ5లో ప్రసారమైన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత్. యాక్టింగ్ విషయంలో అన్నకు ఏమాత్రం తీసిపోడని నిరూపించుకున్నాడు. దీంతో ఇప్పుడు ఇతడికి కూడా సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా సంగీత్ స్టార్ట్ చేసిన సినిమా పేరు ప్రేమ విమానం. ఓ హిట్ ప్రొడ్యూసర్ నుంచి ఈ సినిమా వస్తోంది.

శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మాణంలో సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్ హీరోగా నూతన చిత్రం' ప్రేమ విమానం' మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏషియన్ గ్రూప్స్ భరత్ నారంగ్ క్లాప్ ఇవ్వగా, సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించారు. గీతా ఆర్ట్స్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు.

ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. తన చలాకీతనంతో అందర్నీ ఎట్రాక్ట్ చేసిన సాన్వే మేఘన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. జగదీష్ చీకటి డీవోపీగా వర్క్ చేస్తున్నాడు.

చిన్న బడ్జెట్ లో వీలైనంత తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసి, థియేటర్లలోకి రావాలనేది మేకర్స్ ప్లాన్. పేరుకు ప్రేమకథ అయినప్పటికీ, డిఫరెంట్ సబ్జెక్ట్ ను ఇందులో డీల్ చేశారంట.

First Published:  16 Aug 2022 3:47 AM GMT
Next Story