Telugu Global
Cinema & Entertainment

Prem Kumar | విశ్వక్ సేన్ సినిమాతో సంబంధం లేదంటున్న దర్శకుడు

Prem Kumar Movie - విశ్వక్ సేన్ నటించిన సినిమాకు, తను తీసిన ప్రేమ్ కుమార్ సినిమాకు సంబంధం లేదంటున్నాడు దర్శకుడు అభిషేక్ మహర్షి.

Prem Kumar | విశ్వక్ సేన్ సినిమాతో సంబంధం లేదంటున్న దర్శకుడు
X

సంతోష్ శోభ‌న్, రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రైట‌ర్‌ కమ్ యాక్టర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 18న‌ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తమ సినిమాపై వస్తున్న ఓ ప్రచారాన్ని ఖండించాడు.

"సినిమాల్లో పెళ్లి సీన్‌లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్‌ పెళ్లి ఆపుతాడు. హీరో హీరోయిన్లు కలిసిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరు. వాడికి కూడా ఓ జీవితం ఉంటుంది. అది చెప్పేందుకే ఈ ప్రేమ్ కుమార్ సినిమాను తీశాం. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా టీజర్ చూసినప్పుడు కాస్త భయపడ్డాను. ఇదేంటి నా కాన్సెప్ట్ లాగా ఉందే అని అనుకున్నాను. కానీ ఆ మూవీ దర్శకుడితో మాట్లాడాక.. కాన్సెప్ట్ వేరని అర్థమైంది."

ఇలా తమ సినిమాకు, విశ్వక్ సేన్ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు దర్శకుడు. విశ్వక్ సేన్ సినిమా రిలీజై, సక్సెస్ టాక్ తెచ్చుకున్న తర్వాత, తన సినిమాపై మరింత నమ్మకం పెరిగిందంటున్న ఈ దర్శకుడు... సినిమా విడుదల లేట్ అయిన విషయాన్ని అంగీకరిస్తున్నాడు.

First Published:  13 Aug 2023 2:51 PM GMT
Next Story