Telugu Global
Cinema & Entertainment

HanuMan - ఇది ఈ కాలం కథ అంటున్న దర్శకుడు

Hanuman movie - హనుమాన్ మూవీ ఈ తరం కథ అంటున్నాడు ప్రశాంత్ వర్మ. ఇది భక్తి చిత్రం కాదంటున్నాడు

HanuMan - ఇది ఈ కాలం కథ అంటున్న దర్శకుడు
X

తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హను-మాన్. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. హనుమంతుడి మహిమలతో తెరకెక్కుతున్న సినిమా. అయితే ఇది పురాణం కాదంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పటి జనరేషన్ కథకే హనుమంతుడి టచ్ ఇచ్చామని చెబుతున్నాడు.


"ఇలాంటి సినిమాలు చేసినప్పుడు కచ్చితంగా అంచనాలు ఉంటాయి. వాటిని ప్రజంట్ చేయడం కూడా ఒక సవాల్ తో కూడుకున్నదే. ఐతే మేము అంత సవాల్ తీసుకోలేదు. మేము చెప్పే కథ ప్రస్తుతంలో జరుగుతుంది. హనుమంతుడు కథలో జరిగిన ఒక కీలక సంఘటనని తీసుకొని చేశాం. హనుమంతుని కథలో ఓ సంఘటన జరిగింది కాబట్టి అక్కడి నుంచి ఇలా జరిగుంటే ఎలా ఉంటుందనే అంశంపై బిల్డ్ చేసిన కథ. చాలా వరకూ కథ కరెంట్ టైమ్స్ లో ఉంటుంది. హనుమంతుడిని ఎలా చూడాలని చిన్నప్పటినుంచి అనుకుంటున్నారో అది ఇందులో చూపించగలుగుతున్నాను. హనుమంతుడు ఎలా కనిపించాలనే క్యారెక్టర్ స్కెచ్ పైనే దాదాపు ఏడాది పాటు పని చేశాం."


ఇలా ఇది ఈ తరం కథ అనే విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా టీజర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో, క్వాలిటీపై మరింత ఖర్చు చేస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ కోసమే 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. దీనికితోడు అండర్ వాటర్ సీక్వెన్సులు కూడా ఉన్నాయి


క్వాలిటీ కావాలంటే టైమ్ పడుతుందని, అందుకే హను-మాన్ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతోందని అన్నాడు దర్శకుడు. జూన్ చివరి నాటికి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, జులై ఫస్ట్ వీక్ లో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెబుతున్నాడు.

First Published:  29 May 2023 5:15 AM GMT
Next Story