Telugu Global
Cinema & Entertainment

Hanu-Man: అండర్ వాటర్ లో హనుమాన్

HANU-MAN: టీజర్ ఇచ్చిన ఉత్సాహంతో హనుమాన్ టీమ్ ఇప్పుడు మరింత జోరుగా పనిచేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి సన్నివేశాలు తీస్తోంది.

Hanu-Man: అండర్ వాటర్ లో హనుమాన్
X

తేజ సజ్జ అప్ కమింగ్ మూవీ హను-మాన్. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఈ సినిమా టీజర్ పాన్ ఇండియా లెవెల్లో హిట్టయిన సంగతి తెలిసిందే. టీజర్ లో ప్రతి ఫ్రేమ్ చాలా ఆకర్షణీయంగా ఉంది. హనుమంతుని చూపించిన విధానం అందరికీ నచ్చింది. తేజ సజ్జ సూపర్ హీరోగా ఆకట్టుకున్నాడు.

మరోవైపు, హను-మాన్ టీమ్ ముంబై లో కీలకమైన అండర్ వాటర్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సన్నివేశాల్ని తీస్తున్నారు. తేజ సజ్జ హార్డ్ వర్క్ కనిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు గతంలో ఇదే టీమ్ పని చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ సినిమాకు కూడా వర్క్ చేస్తోంది. ఇప్పుడు హను-మాన్ కు కూడా వర్క్ చేస్తోంది. దీని కోసం హైదరాబాద్‌లో 15 రోజుల పాటు స్పెషల్ ట్రైనర్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు తేజ సజ్జ.

ఇది చాలా రిస్కీ సీక్వెన్స్. దీని కోసం తేజ ఊపిరి తీసుకోకుండా నీటిలో ఉండవలసి ఉంటుంది. అయితే తేజ దానిని పట్టుదలతో ప్రాక్టీస్ చేసి చాలా బాగా చేశాడు.

ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  21 Dec 2022 12:07 PM GMT
Next Story