Telugu Global
Cinema & Entertainment

Pranitha: రీఎంట్రీలో కొత్త ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్

Pranitha Malayalam - టాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రణీత, మల్లూవుడ్ లోకి ఎంటరైంది. మలయాళ స్టార్ హీరో దిలీప్ సరసన ఓ సినిమా చేస్తోంది.

Pranitha: రీఎంట్రీలో కొత్త ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్
X

ప్రణీత.. ఈ హీరోయిన్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో అందర్నీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ సరసన సినిమా చేసిన తర్వాత ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది.

కరోనా టైమ్ లో చడీచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న ఈ పిల్ల, ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడం, బిడ్డకు జన్మనివ్వడం చకచకా జరిగిపోయాయి. అలా కెమెరాకు దూరమైన ప్రణీత, షార్ట్ గ్యాప్ తర్వాత తిరిగి ఫీల్డ్ లోకి వచ్చింది. అయితే రీఎంట్రీలో ఆమె కొత్త ఎంట్రీ ఇచ్చింది. తల్లయిన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ, మలయాళ ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంటరైంది.

మలయాళ స్టార్ దిలీప్ కొత్త చిత్రం లాంఛనంగా కొచ్చిలో ప్రారంభమైంది. D148 అనే టైటిల్ పెట్టారు. రతీష్ రఘునందన్ దర్శకుడు. ఈ ప్రాజెక్ట్‌కు సూపర్ గుడ్ ఫిల్మ్స్, ఇఫ్ఫార్ మీడియా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాలో నీతా పిళ్లై, ప్రణీతను హీరోయిన్లుగా తీసుకున్నారు. ఇన్నాళ్లూ కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో కనిపించిన ప్రణిత, ఇప్పుడీ సినిమాతో మలయాళంలో అడుగుపెట్టింది.

First Published:  29 Jan 2023 1:49 PM GMT
Next Story