Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్-మారుతి సినిమా లాంఛ్

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా లాంఛ్ అయింది. ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది.

ప్రభాస్-మారుతి సినిమా లాంఛ్
X

వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రభాస్, ఈరోజు మరో సినిమా లాంఛ్ చేశాడు. చాన్నాళ్లుగా టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్ గా ఉన్న సినిమా ఇది. అదే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే మూవీ. ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది.

ప్రభాస్ కోసం మంచి కమర్షియల్ కామెడీ సబ్జెక్ట్ రాసుకున్నాడు మారుతి. ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగాయి. మారుతి చెప్పిన కాన్సెప్ట్, సీన్స్ ప్రభాస్ కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడు. ఈ మూవీకి రాజా డీలక్స్ అనే టైటిల్ అనుకుంటున్నారు.

నిజానికి ఈ ప్రాజెక్టును డీవీవీ దానయ్య లేదా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తారని అంతా అనుకున్నారు. కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. సినిమాకు సంబంధించి ప్రస్తుతానికి పూజా కార్యక్రమాలు మాత్రమే నిర్వహించారు. త్వరలోనే ఇతర వివరాలు వెల్లడిస్తారు.

ఓవైపు ఈ సినిమా లాంఛింగ్ జరుగుతుంటే, మరోవైపు బాయ్ కాట్ మారుతి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్, సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. పక్కా కమర్షియల్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన వ్యక్తి, టాలీవుడ్ బి-గ్రేడ్ డైరక్టర్ కు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ అవకాశం ఇవ్వడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

ప్రభాస్ మాత్రం మారుతిని నమ్మాడు. డార్లింగ్ తర్వాత మంచి కామెడీ చేయని ఈ హీరో, ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ఓ కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సలార్, ప్రాజెక్ట్-కె సినిమాల గ్యాప్ లోనే మధ్యమధ్యలో ఈ సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్.

First Published:  25 Aug 2022 6:55 AM GMT
Next Story