Telugu Global
Cinema & Entertainment

Pragya Jaiswal | రకుల్ పార్టీలో ప్రగ్యా ఫొటోషూట్

Pragya Jaiswal - వరుస ఫొటోషూట్స్ తో అదరగొడుతోంది ప్రగ్యా జైశ్వాల్. తాజాగా ఆమె చేసిన ఓ ఫొటోషూట్ కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది.

Pragya Jaiswal | రకుల్ పార్టీలో ప్రగ్యా ఫొటోషూట్
X

ఒకప్పుడు ప్రగ్యా జైశ్వాల్ వేరు, ఇప్పుడు వేరు. ట్రెడిషనల్ వేర్ నుంచి బికినీ వరకు ఏ డ్రెస్ అయినా వేసుకునేంత ధైర్యం ఆమె సొంతం. సంప్రదాయబద్ధంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ, హాట్ లుక్ లోకి మారి చాలా కాలమైంది. సెగ పుట్టించే ఆమె ఫొటోషూట్లు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.

ఇప్పుడు అలాంటిదే మరో ప్రయత్నం చేసింది. ఫెర్రీ బోటుపై నల్లటి దుస్తుల్లో ధగధగలాడే తన తెల్లటి మేనిఛాయను చూపించింది ప్రగ్యా జైశ్వాల్. ఆమె పొడవాటి కాళ్లు,ఈ ఫొటోషూట్ లో హైలెట్ గా నిలిచాయి.

అయితే ఈసారి ఈ ఫొటోషూట్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఇదేదో ప్రగ్యా జైశ్వాల్ ప్లాన్ చేసి తీసిన ఫొటోషూట్ కాదు. ఓ పార్టీని ఇలా తన ఫొటోషూట్ కోసం వాడుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ నెల్లో పెళ్లి చేసుకోబోతున్న రకుల్ ప్రీత్ సింగ్, కొంతమందికి బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీకి ప్రగ్యా జైశ్వాల్ కూడా హాజరైంది. థాయ్ లాండ్ లో జరిగిన ఆ బ్యాచిలర్ పార్టీలో ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు ఇలా తన ఫొటోషూట్ కానిచ్చేసింది ప్రగ్యా జైశ్వాల్. ఈ స్టిల్స్, ఆ బ్యాచిలర్ పార్టీలోనివే. అన్నట్టు ఇదే పార్టీకి మంచు లక్ష్మి కూడా హాజరైంది.








First Published:  7 Feb 2024 12:43 AM GMT
Next Story