Telugu Global
Cinema & Entertainment

Premikudu | మళ్లీ వస్తున్న ప్రేమికుడు

Prabhudeva's Premikudu - 30 ఏళ్ల కిందటొచ్చిన ప్రేమికుడు సినిమాలోని పాటలు ఇప్పటికీ హిట్టే. ఈ సినిమా మళ్లీ వస్తోంది.

Premikudu | మళ్లీ వస్తున్న ప్రేమికుడు
X

మెగా ప్రొడ్యూసర్ కేటీ కుంజుమన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా 30 ఏళ్ల కిందట వచ్చిన సినిమా ప్రేమికుడు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవాకు అదే తొలి సినిమా. నగ్మా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు.

30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300 కు పైగా థియేటర్లలో తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రీ-రిలీజ్ అవుతోంది. దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

ఇప్పటికి కూడా ఈ సినిమాలోని పాటలు అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. 'అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే..' పాటలో ప్రభుదేవా తో సమానంగా ఎస్. పి. బాలు డాన్స్ చేయడం విశేషం.

వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నార్డ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్లీ ఇన్నాళ్లకు థియేటర్లలోకి వస్తోంది.

First Published:  28 April 2024 8:10 AM GMT
Next Story