Telugu Global
Cinema & Entertainment

Kannappa | మంచు విష్ణు కోసం ప్రభుదేవా

Kannappa Movie - కన్నప్ప ప్రాజెక్టుకు మరో టాలెంట్ యాడ్ అయింది. ప్రభుదేవా సెట్స్ పైకి వచ్చారు.

Kannappa | మంచు విష్ణు కోసం ప్రభుదేవా
X

హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ ప్రారంభమైంది. కన్నప్ప సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. తాజాగా ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా రంగంలోకి దిగాడు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించబోతున్నాడు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ప్రభుదేవాకు కన్నప్ప టీం స్వాగతం పలికింది.

అనేక పాటలకు కొరియోగ్రఫీని కంపోజ్ చేసే పనిలో ఉన్న ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ ఈ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందంటున్నాడు విష్ణు. రెండో షెడ్యూల్‌ న్యూజిలాండ్‌లో ప్రారంభం కాగా.. పాటల పిక్చరైజేషన్ నడుస్తోంది.

న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

First Published:  4 March 2024 5:00 PM GMT
Next Story