Telugu Global
Cinema & Entertainment

Salaar | ప్రభాస్ సినిమా సెన్సార్ రిపోర్ట్

Prabhas's Salaar Movie - సలార్ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ చూద్దాం..

Salaar | ప్రభాస్ సినిమా సెన్సార్ రిపోర్ట్
X

Salaar | ప్రభాస్ సినిమా సెన్సార్ రిపోర్ట్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఇప్పుడీ సినిమా విడుదలకు అధికారికంగా కౌంట్ డౌన్ మొదలైంది. సలార్ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.

సినిమాకు సెన్సార్ బోర్డ్ ఎ-సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎ-సర్టిఫికేట్ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. అటు మేకర్స్ కూడా ఈ సినిమాకు అదే సర్టిఫికేట్ వస్తుందని ముందే ఫిక్స్ అయ్యారు. అందుకే ఎ-సర్టిఫికేట్ ను కూడా తమ ప్రచారానికి వాడుకుంటున్నారు.

ఇక సినిమా రన్ టైమ్ విషయానికొస్తే.. సలార్ సినిమా నిడివి కూడా ఎక్కువే. ఈ సినిమా 2 గంటల 55 నిమిషాల 22 సెకెన్లు ఉంది. అంటే, దాదాపు 3 గంటలన్నమాట. ఇలా 3 గంటల నిడివితో సినిమాలు రావడం టాలీవుడ్ లో కొత్తేంకాదు. రీసెంట్ గా వచ్చిన యానిమల్ సినిమా అయితే ఏకంగా 3 గంటల 21 నిమిషాలుంది. కాబట్టి సలార్ రన్ టైమ్ పెద్దగా ఇబ్బంది పెట్టదనే అనుకోవాలి.

ప్రభాస్, పృధ్వీరాజ్ నటించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. తాజాగా వచ్చిన ట్రయిలర్ పెద్ద హిట్టయింది. 16వ తేదీన మరో ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 170 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్టు సమాచారం.

First Published:  9 Dec 2023 3:47 PM GMT
Next Story