Telugu Global
Cinema & Entertainment

Salaar 2 | సలార్-2 ఇప్పట్లో సెట్స్ పైకి రాదా?

Salaar 2 - సలార్-2 మరింత ఆలస్యం అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి ఓ కారణం కూడా ఉంది.

Salaar Box Office Collection |  రూ.600 కోట్ల క్లబ్ లో చేరిన సలార్
X

సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ పెద్ద హిట్టయింది. ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఓటీటీలో దుమ్ముదులుపుతోంది. ఇదే ఊపులో సలార్ పార్ట్-2 ను స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కూడా రెడీగానే ఉన్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సెట్స్ పైకి వస్తాడు.

కానీ ఇప్పట్లో సలార్-2 సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. దీనికి కారణం మరో నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్.

సలార్ సినిమాలో పృధ్వీరాజ్ పాత్ర ఎంత కీలకం అనేది ఆ సినిమా చూసినవాళ్లందరికీ తెలుసు. అలాంటి కీలక పాత్రధారి అందుబాటులో లేకపోతే సలార్-2 ముందుకు కదలదు. అవును.. పృధ్వీరాజ్ ప్రస్తుతం అందుబాటులో లేడు.

సలార్ సినిమా ప్రచారాన్ని పూర్తి చేసిన పృధ్వీరాజ్, లూసిఫర్-2 పనిలో పడ్డాడు. మోహన్ లాల్ హీరోగా పృధ్వీరాజ్ దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నాడు పృధ్వీరాజ్. మార్చి నుంచి ఆమెరికాలో షూటింగ్ కు ప్లాన్ చేశారు.

లూసిఫర్-2 ఓ కొలిక్కి వచ్చేవరకు పృధ్వీరాజ్, సలార్ యూనిట్ కు అందుబాటులోకి రాకపోవచ్చు. కాబట్టి సలార్ పార్ట్-2 మొదలుకావడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది.

First Published:  22 Jan 2024 5:21 PM GMT
Next Story